భయపడాల్సిన సమయం ఆసన్నమైంది.. ‘418’మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

హారర్ సినిమాలను చూసి నవ్వుకోవడం చాలు.. భయపడాల్సిన సమయం ఆసన్నమైంది" అనే క్యాప్షన్ జత చేశారు.

భయపడాల్సిన సమయం ఆసన్నమైంది.. ‘418’మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. వారి నిర్మాణంలో రాబోతున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘418’. సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి కీర్తన్ నాడగౌడ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సపోర్ట్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ '418' చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్‌ను ప్రకటించారు. జూలై 25న సాయంత్రం 4:18 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. "హారర్ సినిమాలను చూసి నవ్వుకోవడం చాలు.. భయపడాల్సిన సమయం ఆసన్నమైంది" అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఓ అమ్మాయి కాళ్లకు పట్టీలు పెట్టుకుని రక్తం కారుతున్నా నడుచుకుంటూ వెళ్తున్న పోస్టర్‌ను షేర్ చేసి ఆసక్తిని రేకెత్తించారు.

Next Story