గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్ కొలువులకు ఉచిత శిక్షణ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 125 రోజుల పాటు ఉచిత ఫౌండేషన్ కోర్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం తెలిపింది...

గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్ కొలువులకు ఉచిత శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 125 రోజుల పాటు ఉచిత ఫౌండేషన్ కోర్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం తెలిపింది. గ్రూప్-I, II, III, IV, బ్యాంకింగ్, ఎస్సెస్సీ, రైల్వే (ఆర్ఆర్‌బీ), పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమయ్యే అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్టు స్టేట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

అర్హతలు..

అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలు మించొద్దు. రెగ్యులర్ కోర్సులు చదువుతున్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు, గతంలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ పొందినవారు అర్హులు కారు. కోచింగ్‌లో ప్రతి నెలా 75 శాతానికి పైగా హాజరునమోదు చేసుకున్న అభ్యర్థులకు పుస్తక నిధి, రవాణా భత్యంతో కలిపి ఐదు నెలల పాటు ప్రతినెలా రూ.1,000 స్టైపెండ్ అందజేస్తారు. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 040-24071178, 7780359322 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25.07.2026

దరఖాస్తుల చివరి తేదీ: 14.08.2026

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 18.08.2026

ధ్రువపత్రాల పరిశీలన: 20.08.2026 నుంచి 24.08.2026 వరకు

కోచింగ్ ప్రారంభం: 25.08.2026

Next Story