- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధారి ఈఎంఆర్ఎస్‌లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
by Kodari Anjali |
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి, దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.

X
దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి, దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ ప్రకటనలో తెలిపారు. ఈఎంఆర్ఎస్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిలర్ (01), కేటరింగ్ అసిస్టెంట్ (01), ఆర్ట్ & క్రాఫ్ట్ (01), టీజీటీ - కంప్యూటర్ సైన్స్ (01), మెస్ హెల్పర్ (02) పోస్టులను పూర్తి తాత్కాలిక పద్ధతిన భర్తీ చేస్తామన్నారు. అర్హతలు, ఇతర వివరాల కోసం గాంధారి ఈఎంఆర్ఎస్ లో సంప్రదించాలని సూచించారు. ఈ 28 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
Next Story






