- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సి రిటైర్‌మెంట్ లో ట్విస్ట్..ధోని లాగానే ప్లాన్ ఛేంజ్!
మెస్సి రిటైర్‌మెంట్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. రిటైర్మెంట్ ను ఆయన వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సి రిటైర్మెంట్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ నేపథ్యంలో మెస్సి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. ఇంతలోనే తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలలు జాతీయ జట్టుకు ఆడతారని వార్తలు వస్తున్నాయి. వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగకపోవచ్చని... అంతలోపు రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు అభిమానుల కోసం ఓ గ్రాండ్ ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని కూడా ఐపీఎల్ కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఓ ఫేర్ వెల్ మ్యాచ్ ఆడిన తర్వాత..చెన్నై స్టేడియంలోనే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మెస్సి కూడా అదే దారిలో వెళ్తున్నారు. కాగా మొన్నటి ఫిఫా వరల్డ్ కప్ లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమిపాలైంది. 1-0 తేడాతో ట్రోఫీ కోల్పోయింది.






