బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు.. కెరీర్‌ను కోల్పోవడానికి కూడా సిద్ధమే.. ఆయేషా ఖాన్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-24 15:02:55  IST  )

తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కంటే కెరీర్‌ను వదులుకోవడానికే తాను సిద్ధంగా ఉన్నానని, ఇలాంటి బెదిరింపులు వేరేవరికైనా ఉపయోగించుకోవాలని భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు.. కెరీర్‌ను కోల్పోవడానికి కూడా సిద్ధమే.. ఆయేషా ఖాన్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్ష లీకేజీ అక్రమాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. వారి పోరాటానికి ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. తాజాగా, విద్యార్ధులకు మద్దతుగా మాట్లాడినందుకు ఓ హీరోయిన్ చిక్కుల్లో పడింది. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని దాదర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆయేషా తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు. నిరసన ప్రారంభం కాకముందే రంగంలోకి దిగిన పోలీసులు, ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి వోర్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ, "ఈ ఘటన తర్వాత నీకు బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రావు" అని కామెంట్ చేశారు. ఆ నెటిజన్‌కు ఆయేషా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కంటే కెరీర్‌ను వదులుకోవడానికే తాను సిద్ధంగా ఉన్నానని, ఇలాంటి బెదిరింపులు వేరేవరికైనా ఉపయోగించుకోవాలని భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని కోరినా అధికారులు సమాధానం ఇవ్వలేదని, మహిళా పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి నెట్టేశారని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు.

Next Story