- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఆంటోని బర్త్ డే స్పెషల్.. ‘నాన్నకుట్టి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
నేడు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ.. హిట్ అందుకోలేకపోతున్నారు. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘వంద దేవుళ్లు’ చిత్రంతో అలరించిన ఆయన హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్నారు. నేడు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నాన్న కుట్టి’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా మనసుకు హత్తుకునే తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రానికి మారన్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, హరిప్రియ, ముత్తుకుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోగానే కాకుండా ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ ఆంటోనీ స్కూల్ బ్యాగ్ వేసుకుని, చేతిలో లంచ్ బాక్స్ పట్టుకుని ఎంతో సంతోషంగా నడుస్తూ కనిపించారు. ఆయన పక్కనే స్కూల్ యూనిఫామ్‌లో ఓ చిన్న పాప చిరునవ్వుతో నడుస్తూ కనిపించింది. తండ్రీకూతుళ్ల ప్రేమానురాగాలను చాటిచెప్పేలా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతోంది.






