- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీ సర్వే తో భూ సమస్యలకు చెక్ : కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని చిన్న వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఆదేశాల ప్రకారం భూముల రీ సర్వే తో భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని అన్నారు. భవిష్యత్తులో భూమి వివాదాలు లేకుండా రికార్డులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో భూములకు సంబంధించి హద్దులు, భూమి స్పష్టత, ప్రభుత్వ భూములు లను నిర్ధారణ సులభతరం అవుతుందన్నారు. నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి న్యాయపరంగా రావాల్సిన భూమి పొందే అవకాశం కల్పిస్తామన్నారు.
అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. సాదా బైనామ దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో దాదాపు 90 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో సేకరించి అధికారులు యాప్ లో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయుల హాజరు రికార్డును పరిశీలించిన కలెక్టర్ ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరు అయినట్టు గమనించి అందుకు గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. సెలవు పత్రం లేని పక్షంలో షోకాజు నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






