- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలి
అంతర్జాతీయ వేదికలపై సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : అంతర్జాతీయ వేదికలపై సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో అండర్-13, అండర్-15 బాలురు, బాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట స్టేడియానికి రూ.11 కోట్ల నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్ధాంతరంగా పనులను నిలిపి వేసిందన్నారు. సిద్దిపేట ప్రాంతం తెలంగాణలో భాగం కదా.. సిద్దిపేట క్రీడాకారులు తెలంగాణ వాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట క్రీడాకారుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చూపుతోంది అన్నారు. సిద్దిపేట స్పోర్ట్స్ హబ్‌గా దేశానికి ఆదర్శంగా నిలవాలనేది నా కల అన్నారు. ఫుట్‌బాల్ మైదానంలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం పెరుగుతుంది అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆగిపోయిన పనులు పూర్తి చేయిస్తా అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పై మున్సిపల్ అధికారులతో హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్, సానిటరీ విభాగాల్లో సిబ్బంది కొరత పై పబ్లిక్ హెల్త్ ఈ ఎన్ సీ తో హరీష్ రావు ఫోన్ లో మాట్లాడి రెగ్యులర్ సిబ్బందిని కేటాయించాలని కోరారు. నర్సపూర్, ఎర్ర చెరువు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సమీక్ష లో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






