వాస్తు నిర్మాణాలు ఏవైనా ఉంటే ఇండ్లలో చేపట్టండి..! మున్సిపాలిటీలో కాదు..!

by Taduka Kalyani |

వాస్తు నిర్మాణాలు ఏవైనా ఉంటే తమ ఇండ్లలో చేపట్టుకోవాలి కానీ మున్సిపాలిటీలో కాదంటూ ప్రతిపక్ష ఎంఐఎం కౌన్సిలర్స్, నాయకులు ఆరోపించారు.

వాస్తు నిర్మాణాలు ఏవైనా ఉంటే ఇండ్లలో చేపట్టండి..! మున్సిపాలిటీలో కాదు..!
X

దిశ,బైంసా : వాస్తు నిర్మాణాలు ఏవైనా ఉంటే తమ ఇండ్లలో చేపట్టుకోవాలి కానీ మున్సిపాలిటీలో కాదంటూ ప్రతిపక్ష ఎంఐఎం కౌన్సిలర్స్, నాయకులు ఆరోపించారు. శుక్రవారం బైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో గల మినీ గార్డెన్ గద్దె నిర్మాణాన్ని తొలగించడంపై ఎంఐఎం కౌన్సిలర్స్, ఎం. ఐ. ఎం శ్రేణులు మండి పడ్డాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎలాంటి తీర్మానం లేకుండానే మున్సిపాలిటీ ప్రాంగణంలో గల గద్దెని కూల్చివేయడం అప్రజాస్వామికమని, పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టక ప్రజాధనాన్ని వృధా చేసే ఇలాంటి కార్యకలాపాలకు పూనుకోవడం తప్పని అన్నారు. తీర్మానం లేకుండా గద్దె నిర్మాణాన్ని కూల్చడంపై నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. లేనియెడల జిల్లా కలెక్టర్ కి సైతం ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Next Story