- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులెత్తి దండం పెడుతున్నా...శేఖర్ కమ్ముల పోస్ట్ వైరల్
ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. CJP, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆందోళనలో పాల్గొంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఇక ఈ అంశంపై సినీ సెలబ్రిటీలతో పాటు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇక ఈ జఠిలమైన అంశంపై టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తన గళం విప్పారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు పరిహారం ఎవరూ అడక్కుండా కేంద్ర సర్కార్ చేయాల్సిన పనులు అన్నారు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికి లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఎమోషనల్ అయ్యారు. విద్యార్థుల డిమాండ్స్ లో న్యాయం ఉందని తెలిపారు. ప్రభుత్వం వాళ్ల మాట వినాలని కోరారు. వాళ్లకు భరోసా ఇచ్చి, స్ఫూర్తిని గెలిపించాలని వెల్లడించారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టేనని... వాళ్లు గెలిస్తే మనం బ్రతికినట్టు అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నానని పోస్ట్ పెట్టారు.






