- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో దారుణం.. తాళి బొట్టు తెంపి నవ దంపతులపై దాడి
ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ నవదంపతులపై యువతి బంధువులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. రక్షణ కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో దారిలోనే వారిని అడ్డుకున్న బంధువులు దాడికి తెగబడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ నవదంపతులపై యువతి బంధువులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. రక్షణ కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో దారిలోనే వారిని అడ్డుకున్న బంధువులు దాడికి తెగబడ్డారు. అంతేకాదు యువతి మెడలోని తాళిబొట్టును సైతం తెంచివేసి, నవవరుడు చందుపై దారుణంగా భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఊహించని ఈ దాడితో తీవ్ర భయాందోళనకు గురైన ఆ నవదంపతులు, ప్రాణభయంతో వెంటనే సమీపంలోని ఒక కార్యాలయంలోకి పరుగులు తీసి దాక్కున్నారు.
స్థానికుల సాయంతో ఎట్టకేలకు ఆ దాడి నుంచి బయటపడిన దంపతులు, జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు బాధిత దంపతులకు తగిన రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
Next Story






