- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు గంజిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు గంజిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని 54 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ట్రస్ట్ నిర్వాహకులు, విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ చీరలను అందజేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, స్థానిక కౌన్సిలర్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ.. డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ తన తల్లి జ్ఞాపకార్థం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, పదవీ విరమణ అనంతరం అందుతున్న పెన్షన్‌ను సమాజ సేవకు వినియోగించడం ఆదర్శనీయమని కొనియాడారు. సమాజంలో ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, స్కావెంజర్లకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు కూడా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సునీత, సింధుజ, సమ్మయ్య, సుమలత, శ్రీలేఖ, భారతి, జమదగ్ని, అబ్దుల్ హలీమ్, నాయకులు రొంటాల బుచ్చయ్య, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






