'ధర్మాన్ని కాపాడండి.. ధర్మేంద్ర ప్రధాన్‌ను కాదు'

by Ratna Kumari |

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

ధర్మాన్ని కాపాడండి.. ధర్మేంద్ర ప్రధాన్‌ను కాదు
X

దిశ, నర్సంపేట : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు జయ్యారపు అఖిల్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని కోరారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడిని ఖండించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. "ధర్మాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు" అని అఖిల్ విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story