- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : గర్భిణులపై ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా?
కాలుష్యం ప్లాసెంటా ద్వారా శిశువుకు చేరి ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కలిగించి మెదడు వికాసాన్ని ప్రభావితం చేస్తుంది!

దిశ, ఫీచర్స్ : గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నివాసం ఉంటున్నవారు జాగ్రత్త! ఎందుకంటే.. ఇది తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని The Lancet Planetary Health జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ (NO₂), PM2.5 (ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్), బ్లాక్ కార్బన్ వంటి కాలుష్యాలు శిశువు మెదడు నిర్మాణంలో స్వల్ప మార్పులకు కారణమవుతాయని పరిశోధకులు గుర్తించారు.
బార్సిలోనా BiSC ప్రాజెక్ట్ ఆధారంగా సుమారు 754 గర్భిణులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, రెండవ & మూడవ త్రైమాసికాల్లో కాలుష్య బారిన పడిన వారి శిశువుల మెదడు స్ట్రక్చర్‌లను ట్రాన్స్‌వాజినల్ న్యూరోసోనోగ్రఫీ (ప్రత్యేక అల్ట్రాసౌండ్) ద్వారా పరిశీలించారు. ఫలితంగా మెదడు కుహరాలు (లాటరల్ వెంట్రికల్స్) పెద్దవవడం, సిస్టెర్నా మాగ్నా విస్తరణ, మోటార్ స్కిల్స్‌కు సంబంధించిన ప్రాంతాల్లో మార్పులు వంటివి గమనించబడ్డాయి. ఈ మార్పులు భవిష్యత్తులో శిశువు మెదడు అభివృద్ధి, మోటార్ సామర్థ్యాలు, సెన్సరీ ప్రాసెసింగ్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇతర ప్రమాదాలు: వాయు కాలుష్యం గర్భిణుల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా రిస్క్‌ను పెంచుతుంది. కాలుష్యం ప్లాసెంటా ద్వారా శిశువుకు చేరి ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కలిగించి మెదడు వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మార్పులు సాధారణంగా స్వల్ప స్థాయిలో ఉంటాయి, వ్యక్తిగతంగా పాతాలజికల్ (వ్యాధికర) మార్పులు కావు. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే.. గర్భిణులు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పొగమంచు రోజుల్లో ఇంటి బయటకు తక్కువగా వెళ్లడం, మాస్క్ ఉపయోగం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఎయిర్ ప్యూరిఫైయర్ వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించే పాలసీలు (గ్రీన్ ఎనర్జీ, ట్రాఫిక్ నియంత్రణ) కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






