- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మల్ని సోనమ్ వాంగ్‌చుక్ దగ్గరకు వెళ్లనీయడం లేదు: అభిజీత్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యార్థులపై దాడికి దిగిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రజల ముందుకు తీసుకురావడానికి సీజేపీ (CJP) తరఫున త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు అభిజీత్ వెల్లడించారు. "దాడికి పాల్పడిన ఫొటోలు, వీడియోలన్నీ ఈ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తాం. ‘విద్యార్థులపై లాఠీలు ఎత్తినది పోలీసులు కాదు.. గూండాలు’ అని వెల్లడించారు. దీనిపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.
మమ్మల్ని కలవనీయడం లేదు..
సోనమ్ వాంగచుక్‌ను కేంద్రమంత్రులు తప్ప వేరే ఎవరూ కలవకుండా కట్టుదిట్టం చేశారని, ప్రతిపక్ష నేతలను కానీ, తమను కానీ ఆయనను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అర్థరాత్రి నుంచి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. జంతర్ మంతర్ నుంచి విద్యార్థులను, నాయకులను తరలించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఒకవేళ తమను అక్కడ నుంచి బలవంతంగా తరలించాలని చూస్తే, ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పేపర్ లీక్‌లపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం






