పేపర్ లీక్‌లపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

by Malleboina Mahesh |

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో పేపర్ లీక్ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా.

పేపర్ లీక్‌లపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ యూజీ పేపర్ లీక్ పై దేశ వ్యాప్తంగా సీజేపీ (CJP) నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో.. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. 'పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ('Paper Leak Act Amendment Bill') ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానివ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కొత్త చట్ట సవరణ ప్రకారం పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. లీకేజీలకు పాల్పడే ముఠాలు, వ్యక్తులకు ఏకంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండగా.. సోమవారం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

Next Story