కర్మన్‌ఘాట్ ఆలయంలో వరుణ యాగం

by Jakkula.Mamatha |

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం వరుణ యాగం వైభవంగా నిర్వహించారు.

కర్మన్‌ఘాట్ ఆలయంలో వరుణ యాగం
X

దిశ, చంపాపేట్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం వరుణ యాగం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు, దేవాదాయ శాఖ కమిషనర్ మార్గదర్శకాల మేరకు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య పర్యవేక్షణలో ఈ ప్రత్యేక యాగం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వరుణ దేవుడికి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తొలగిపోవాలని, చెరువులు, జలాశయాలు నిండాలని, వ్యవసాయానికి అనుకూలంగా విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సస్యశ్యామల తెలంగాణ సిద్ధించాలని సంకల్పించి ప్రార్థనలు చేశారు. దేవాదాయ శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగిన ఈ యాగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా సాగింది.

Next Story