- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు.. కేరళలో బీజేపీ యువమోర్చా ఆందోళన
కేరళలోని తిరువనంతపురంలో పీఎస్సీ పరీక్షల అవకతవకలపై సీఎం అధికారిక నివాసం వెలుపల బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వి. మను ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ కేరళ రాష్ట్రంలో మరో పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేరళలో పీఎస్సీ (PSC) పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై బీజేపీ యువమోర్చా తీవ్ర నిరసన చేపట్టింది. తిరువనంతపురంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల యువమోర్చా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వి. మను ప్రసాద్ (V. Manu Prasad) తో పాటు ఇతర పార్టీ ప్రధాన నాయకులు నాయకత్వం వహించారు.
పీఎస్సీ పరీక్షల్లో నెలకొన్న సమస్యలు, అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా సీఎం నివాసం బయట నిరసన చేస్తున్న బీజేపీ యువ మోర్చ నేతలపై పోలీసులు వాటర్ గన్‌లను ఉపయోగించారు. నిరసన కారులను చెదర గొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






