- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరకగూడెం నూతన ఎంపీడీఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
కరకగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా(ఎంపీడీవో) శ్రీనివాస్ నూతన బాధ్యతలు స్వీకరించారు.

దిశ,కరకగూడెం: కరకగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా(ఎంపీడీవో) శ్రీనివాస్ నూతన బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పథకం పనుల అమలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ శ్రీనివాస్‌ను మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.






