- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరితెగించిన భూ కబ్జాదారులు
సర్కిల్ పరిధిలోని నాదర్ గుల్ డివిజన్, గుర్రం గూడా పరిధి లోని శ్రీనివాస్ పురం రోడ్డు నెంబర్ 10 లో ఉన్న 160 గజాల స్థలాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు.

దిశ,బడంగ్ పేట్ : సర్కిల్ పరిధిలోని నాదర్ గుల్ డివిజన్, గుర్రం గూడా పరిధి లోని శ్రీనివాస్ పురం రోడ్డు నెంబర్ 10 లో ఉన్న 160 గజాల స్థలాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. గత 20 సంవత్సరాల క్రితం కాలనీలో వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు స్థానికుల నీటి సౌకర్యం కోసం వాటర్ ట్యాంక్ నిర్మించినట్లు నాదర్ గుల్ డివిజన్ బీజేపీ మహిళా సెక్రటరీ మంజుల వాణి తెలిపారు. అది శిధిలావస్థకు చేరుకోవడంతో 2 సంవత్సరాల క్రితం సర్కిల్ అధికారులు కూల్చివేయడం జరిగిందని అన్నారు. మూడు నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిన్న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో స్థలం చుట్టూ ఫ్రీ కాస్ట్ ఫాల్ నిర్మిస్తుండగా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని తెలిపారు. బడంగ్ పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో ప్రభుత్వ స్థలమని పాతి పెట్టిన బోర్డును తీసివేసి ట్రాలీ ఆటోలు తీసుకుని వెళ్లారని అన్నారు. కాలనీ మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని బెదిరించి స్థలం చుట్టూ ఫ్రీ కాస్ట్ వాళ్ళ నిర్మించారు. ప్రభుత్వ స్థలమని అధికారాలు బోర్డు ఏర్పాటు చేసిన కబ్జాదారులు బరితెగించడం వెనకాల ఎవరున్నారు అనే చర్చ బడంగ్ పేట్ సర్కిల్ లో చర్చనీయ అంశమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్రీ కాస్ట్ వాల్ గోడను కూల్చి వేయాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.






