రీ సర్వేతో భూముల సమస్యలకు పరిష్కారం : ఆర్డీవో రమాదేవి

by Taduka Kalyani |

రీ- సర్వే తో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు.

రీ సర్వేతో భూముల సమస్యలకు పరిష్కారం : ఆర్డీవో రమాదేవి
X

దిశ, నిజాంపేట: రీ- సర్వే తో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. నిజాంపేట మండలం నందిగామ లో శుక్రవారం భూముల రీ సర్వే పై ఏర్పాటు చేసిన గ్రామసభలో హాజరై ఆమె మాట్లాడారు.. ఏళ్ల తరబడి మోకపై ఉన్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని, అక్రమంగా పట్టాలు పొందిన వారికి సంక్షేమ పథకాలు రద్దయ్యేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హులైన రైతులకు న్యాయం చేస్తామన్నారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల స్వప్న రమేష్, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ తదితరులు ఉన్నారు.

Next Story