- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయం చేస్తానంటూ నమ్మించి బంగారం చోరీ
సాయం చేస్తానంటూ నమ్మించి ఓ మహిళ ఇంట్లో బస చేసి, తెల్లవారుజామున బంగారం చోరీ చేసి పరారైన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, రఘునాథపల్లి : సాయం చేస్తానంటూ నమ్మించి ఓ మహిళ ఇంట్లో బస చేసి, తెల్లవారుజామున బంగారం చోరీ చేసి పరారైన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన గుడి ప్రమీల హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా జనగామ బస్టాండ్‌లో ఓ గుర్తుతెలియని యువతి పరిచయమైంది. గ్రామంలో తనకు తెలిసినవారు ఉన్నారని చెప్పి ప్రమీలను నమ్మించింది. అనంతరం గురువారం రాత్రి ప్రమీల ఇంట్లో బస చేసింది.
తెల్లవారుజామున లేచి చూడగా ఇంట్లో ఉన్న సుమారు 15 గ్రాముల బంగారం కనిపించకపోవడంతో పాటు ఆ యువతి కూడా పరారైనట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు గ్రామస్తులకు సమాచారం అందించగా వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. గుర్తుతెలియని యువతి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






