- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీకు మార్కులు తగ్గితే.. లోకేశ్‌కు తగ్గినట్లే : సీఎం చంద్రబాబు
పిల్లల్ని కనడాన్ని భారంగా భావించకుండా .. భవిష్యత్తులో పిల్లలో ఆస్తి అనుకునేలా మార్చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లల్ని కనడాన్ని భారంగా భావించకుండా .. భవిష్యత్తులో పిల్లలో ఆస్తి అనుకునేలా మార్చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ - టీచర్స్ మీటింగ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికివందనం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేసినట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి రూ.664 కోట్లు ఖాతాల్లో వేశామన్నారు.
పిల్లలు పుడితే భారం కాదు.. ఆదాయంగా మార్చేశాం: సీఎం
‘భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు.. ఆదాయంగా మార్చేశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేసినట్టు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5లక్షల మందికి రూ.664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. విద్యార్థులకు మార్కులు తగ్గితే విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ కు కూడా మార్కులు తగ్గినట్లేనన్నారు. ఏరికోరి మరి ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నారని, లోకేశ్ చొరవతో ప్రభుత్వ స్కూళ్లలో కనిపిస్తోన్న మార్పులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.
కొత్త జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి వచ్చానని, నేడు తాను కూడా టీచర్ ను, స్టూడెంట్ ను, తల్లిదండ్రులకు మెంటర్ గా మారానన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాధ్యతలను సమానంగా తీసుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తు బ్రైట్ గా ఉంటుందన్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1.10 లక్షల మంది విద్యార్థులు చేరారని, ఇదే ప్రభుత్వ స్కూళ్ల సత్తా అని సీఎం చంద్రబాబు గర్వంగా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, వారికి అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో హ్యాండ్ బుక్ ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం దాతల సహకారంతో ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేసేందుకు బడికోసం డోనర్ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభమైన వెంటనే రంపచోడవరం హైస్కూల్ కు మీ సేవ ఆపరేటర్ చిట్టిబోయిన ఉదయ్ లక్ష రూపాయలు విరాళం ప్రకటించగా.. నెల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు పారిశ్రామికవేత్త పూర్ణచంద్రరావు రూ.4 కోట్లు విరాళం ప్రకటించడం సభలో హర్షాతిరేకాలను నింపింది.






