విద్యార్థుల గొంతు నొక్కితే సహించేది లేదు: ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

by Kodari Anjali |

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జీకి నిరసనగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ భగ్గుమంది.

విద్యార్థుల గొంతు నొక్కితే సహించేది లేదు: ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
X

దిశ, మధిర: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జీకి నిరసనగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ భగ్గుమంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థుల గొంతు నొక్కే కుట్రలపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంద్‌లో భాగంగా మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి సంపూర్ణ బంద్‌ను కొనసాగిస్తున్నారు. కళాశాల గేట్ల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మడపల్లి లక్ష్మణ్ పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని, దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందనడానికి ఢిల్లీ ఘటనే నిదర్శనం అన్నారు. విద్యార్థుల గొంతు నొక్కితే సహించేది లేదు. తక్షణమే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యనాన్ని మరింత తీవ్రం చేస్తాం అని హెచ్చరించారు.

Next Story