- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేనలో గ్రూపు పాలిటిక్స్.. మంత్రి నాదెండ్ల స్ట్రాంగ్ వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగంగా టికెట్లు దక్కించుకోవడంతో పాటు వీలైనన్నీ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానిక కేడర్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తుండటంపై ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగంగా టికెట్లు దక్కించుకోవడంతో పాటు వీలైనన్నీ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానిక కేడర్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తుండటంపై ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు కార్లలో వెళ్లి బ్యానర్లు కట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని హెచ్చరించారు. పార్టీలో అందరిని కలుపుకుని సమన్వయంతో ముందుకెళ్లాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులు వ్యూహంతో ముందుకి వెళ్లాలని మంత్రి నాదెండ్ల పిలుపు నిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలు పూర్తిగా మద్దతిస్తారని తెలిపారు. జనసేన పార్టీ స్వార్థ రాజకీయాలు చేయదన్నారు. మాటకు కట్టుబడి ఉండటం వల్లే ప్రభుత్వంలో ఉన్నామని తెలిపారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లొద్దన్నారు. సమస్యపై మాత్రమే పోరాటం చేయాలని, పవన్ కల్యాణ్ కూడా మద్దతిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పవన్ కల్యాణ్ నాయకత్వం కోసమే పని చేస్తున్నాం..
‘‘పవన్ కల్యాణ్ నాయకత్వం కోసమే జనసేన నేతలు, కార్యకర్తలు పని చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలి. అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. పొత్తులో ఉన్నాం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగాలి. పార్టీ బలోపేతం కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం నమోదు అయింది. విజయవాడలో కూడా పార్టీ బలంగా ఉంది. విజయవాడలో చాలా కార్యక్రమాలు నిర్వహించాం. జనవాణిలో చాలా సమస్యలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తే సమస్యలు పరిష్కారం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు.’’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.






