- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు డిమాండ్లకు ఓకే.. రేపు మరోసారి సీజేపీతో చర్చలు : జేపీ నడ్డా
కేంద్రం - సీజేపీ మధ్య రెండో విడత చర్చల్లో సీజేపీ ప్రతినిధులు కేంద్రం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కు సీజేపీ పట్టుపడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం - సీజేపీ మధ్య రెండో విడత చర్చల్లో సీజేపీ ప్రతినిధులు కేంద్రం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కు సీజేపీ పట్టుపడుతోంది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని సీజేపీ డిమాండ్ చేసింది. సీజేపీ డిమాండ్లలో కేంద్రం రెండు డిమాండ్లు నెరవేర్చేందుకు సానుకూలంగా స్పందించింది. ధర్మేంద్రప్రధాన్ రాజీనామా మినహా మిగతా రెండు డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం చెప్పేందుకు మరింత సమయం కావాలని కేంద్రం .. సీజేపీ ప్రతినిధులకు తెలిపింది.
రేపు మరో విడత చర్చలు
సీజేపీతో చర్చలు ముగిసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. సీజేపీ - కేంద్రం మధ్య రేపు మరో విడత చర్చలు జరుగుతాయని తెలిపారు. కొన్ని డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రేపటిదాకా సమయం తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థులు మూడు డిమాండ్లను తమ ముందు ఉంచారని, వాటిపై కీలకంగా చర్చించాల్సి ఉందని తెలిపారు.
ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే..
మరోవైపు సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రానికి స్పష్టంగా చెప్పామన్నారు. తమ డిమాండ్లపై శనివారం మధ్యాహ్నం లోగా చర్యలు తీసుకోవాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం ఆగదన్నారు. ఆయన రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించే బాధ్యత ప్రధాని నరేంద్రమోదీదే అని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఆయనతో రాజీనామా చేయించలేని పక్షంలో.. మోదీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని కుండబద్దలు కొట్టారు.






