నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు: మహేశ్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

నీట్ ఉద్య‌మంలో కేసీఆర్ ఎందుకు పాల్గొన‌లేద‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు. బీజేపీతో లోప‌కారి ఒప్పందం కార‌ణంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్ల‌లేద‌ని వ్యాఖ్యానించారు.

నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు: మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ‌, వెబ్ డెస్క్: నీట్ ఉద్య‌మంలో కేసీఆర్ ఎందుకు పాల్గొన‌లేద‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు. బీజేపీతో లోప‌కారి ఒప్పందం కార‌ణంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్ల‌లేద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సున్నా తెచ్చుకుని ఎంపీ స్థానాల‌ను బీజేపీకి దానం చేశార‌ని ఆరోపించారు. చాలా ప్రాంతీయ‌పార్టీలు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయ‌ని, బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉంద‌నేది నిజం అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ బిల్లుల‌కు బీఆర్ఎస్ ప‌దేళ్ల‌పాటు మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ల‌క‌పోయినా ఉద్య‌మంలో పాల్గొన్నార‌ని అన్నారు.

బీఆర్ఎస్ ఈ నెల రోజులు నీట్ గురించి మాట్లాడ‌లేద‌ని ఇప్పుడు వ‌చ్చి ధ‌ర్నాచౌక్ వ‌ద్ద కూర్చుకున్నార‌ని అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని నాట‌కాలు ఆడినా ప్ర‌జ‌లు మీ వెంట న‌డిచే ప‌రిస్థితి లేద‌ని చెప్పారు. మీరు యూనివ‌ర్సిటీకి వెళ్ల‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు మ‌ర‌ణించారని, విద్యార్థులు చ‌నిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రు అని నిల‌దీశారు. ఉద్య‌మంలో పార్టీ కోసం నిరుద్యోగుల‌ను వాడుకున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు మీ పోలీసు రాజ్యం, మీ ఇసుక మాఫియా గురించి మ‌ర్చిపోలేద‌ని మండిప‌డ్డారు. హ‌రీష్ రావు నీళ్ల గురించి మాట్లాడుతున్నార‌ని, మీ పాల‌న‌లో జ‌రిగిన నీళ్ల దోపిడి గురించి కూడా మ‌ర్చిపోలేద‌న్నారు.

Next Story