తొలి ఏకాదశి స్పెషల్.. రూ.500 కొట్టు మేకను పట్టు!

by Jakkula.Mamatha |

చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ ఇటీవల సోషల్ మీడియా ఇతర మార్గాల్లో "తొలి ఏకాదశి స్పెషల్ రూ.500 కొట్టు.. మేకను పట్టు!" అంటూ వస్తున్న ప్రకటనల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ పోచంపల్లి సతీష్ హెచ్చరించారు.

తొలి ఏకాదశి స్పెషల్.. రూ.500 కొట్టు మేకను పట్టు!
X

దిశ, చిట్యాల: చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ ఇటీవల సోషల్ మీడియా ఇతర మార్గాల్లో "తొలి ఏకాదశి స్పెషల్ రూ.500 కొట్టు.. మేకను పట్టు!" అంటూ వస్తున్న ప్రకటనల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ పోచంపల్లి సతీష్ హెచ్చరించారు. కేవలం రూ.500కే 10 కేజీల మేక అంటూ 30 టోకెన్ల పేరుతో ప్రజలను ఆకర్షించి, సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు ఇలాంటి చట్టవిరుద్ధమైన ప్రచారాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దు, అనుమతి లేకుండా టోకెన్ వ్యవస్థ, లక్కీడ్రా, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. ఇలాంటి నకిలీ ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసగించే వారిపై ఈ రకమైన నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ పరిధిలో ఇలాంటి అనుమానాస్పద లాటరీలు, టోకెన్ విక్రయాలు మోసపూరిత ప్రకటనలు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు, డయల్ 100 కి సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

Next Story