- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ జన్మదినం.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాల సందడి..!
మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

దిశ, చందంపేట: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడిత్య రమేష్ నాయక్ హాజరై స్థానిక బస్‌స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వడిత్య రమేష్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఐటీ రంగ విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దూరదృష్టితో తెలంగాణను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన నాయకుల్లో కేటీఆర్ ఒకరని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.






