నారాయణపూర్ చెరువు కట్టను పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి

by Ratna Kumari |

గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ అక్విజిషన్) బండి రాజేశ్వరి గురువారం పర్యటించారు.

నారాయణపూర్ చెరువు కట్టను పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి
X

దిశ, గంగాధర : గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ అక్విజిషన్) బండి రాజేశ్వరి గురువారం పర్యటించారు. గ్రామంలోని నారాయణపూర్ చెరువు కట్ట నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారుల నుంచి అలైన్‌మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెరువు ముంపు ప్రభావానికి గురవుతున్న సమీప నివాసాలను సందర్శించి, స్థానిక బాధితులతో మాట్లాడారు. కట్ట నిర్మాణం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, పనుల్లో పారదర్శకత పాటించాలని సంబంధిత అధికారులకు బండి రాజేశ్వరి సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ అంబటి రజిత, ఇరిగేషన్ శాఖ అధికారులు, గిర్దావర్ సంతోష్ కుమార్, జీపీఓ శైలజ, గ్రామ నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

Next Story