నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోడీ సంచలన వీడియో: క్షణాల్లో వైరల్.. రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్!

by Malleboina Mahesh |

నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అర్ధరాత్రి వేళ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రత్యక్ష వీడియో సందేశానికి నెటిజన్లు, విద్యార్థుల నుండి అపూర్వ స్పందన లభించింది.

నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోడీ సంచలన వీడియో: క్షణాల్లో వైరల్.. రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై గురువారం అర్ధరాత్రి వేళ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ప్రత్యక్ష వీడియో సందేశానికి నెటిజన్లు, విద్యార్థుల నుండి అపూర్వ స్పందన లభించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్స్‌తో విశేష ఆదరణ పొందింది. "పేపర్ లీకేజీలు సాధారణ విషయాలు కావు.. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడే వేదన నాకు బాగా తెలుసు" అంటూ ప్రధాని మోడీ విద్యార్థుల పట్ల చూపిన పారదర్శకత, బాధ్యతాయుత స్పందన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అర్థరాత్రి పెట్టిన ఈ పోస్టుకు 24 గంటలు గడవకముందే 198మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 12.1 మిలియన్ లైక్స్, 4.9 మిలిన్ షేర్స్, 1 మిలియన్ కామెంట్స్ వచ్చాయి. దీంతో ప్రధాని వీడియోకు ఎంతటి ఆదరణ ఉందో ఈ వీడియో స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే నీట్ అంశంపై ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) పోస్ట్ చేసిన ఈ సంచలన వీడియోలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలను వివరించారు. అక్రమార్కులను తక్షణమే అరెస్టు చేసి జైలుకు పంపడమే కాకుండా, విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా రికార్డు స్థాయిలో మళ్లీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని పేర్కొన్నారు. అంతేకాక, నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ఏర్పాటు, కఠినమైన కొత్త చట్ట సవరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. యువత సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని తీసుకుంటున్న ఈ నిర్ణయాత్మక అడుగులు, నేరుగా విద్యార్థులతో అనుసంధానమైన తీరు పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

Next Story