'శ్రీనివాస మంగాపురం' సెన్సార్ పూర్తి

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'U/A' సర్టిఫికెట్‌ను పొందింది.

శ్రీనివాస మంగాపురం సెన్సార్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: జయకృష్ణ ఘట్టమనేని తాజాగా 'శ్రీనివాస మంగాపురం' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఈ సినిమాతోనే హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇందులో రాషా తడాని కథానాయికగా నటించగా, అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందననే దక్కించుకున్నాయి. అయితే విడుదల అనంతరం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని పి. ఉదయ్ కిరణ్, జెమిని కిరణ్ నిర్మించగా, సి. అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.




Next Story