- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు షురూ.. ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ!
ఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’ భవనం వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘నీట్’ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యా వ్యవస్థలోని లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం (Govt. of India) ఎట్టకేలకు చర్చలు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో, వారి ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’ భవనం వేదికగా ఈ కీలక సమావేశం కొనసాగుతోంది.
ఈ భేటీలో ప్రధానంగా ‘నీట్’ పరీక్షలో జరిగిన తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులు, భవిష్యత్తులో దేశ విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణల గురించి ఇరువర్గాలు చర్చిస్తున్నట్లుగా సమాచారం. నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్ర వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ నేతలు కేంద్ర ప్రతినిధుల ముందు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన, కీలక హామీలను సీజేపీ ప్రతినిధులు ఎదుట పెట్టినట్లుగా తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, లీకేజీలపై కఠిన చర్యలు, ఏజెన్సీల ప్రక్షాళన వంటి హామీలపై సీజేపీ పట్టుదలతో ఉందని సమాచారం.






