ఆ ఒక్క సెకన్ ఆలస్యమైతే ఘోరం జరిగేది.. కానిస్టేబుల్ సాహసానికి హాట్సాఫ్!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-24 07:54:13  IST  )

చనిపోతానన్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకొని కాపాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

ఆ ఒక్క సెకన్ ఆలస్యమైతే ఘోరం జరిగేది.. కానిస్టేబుల్ సాహసానికి హాట్సాఫ్!
X

దిశ, సదాశివ నగర్: చనిపోతానన్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకొని కాపాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. విధులు ముగించుకుని కామారెడ్డికి వెళ్తున్న సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అజర్ రాత్రి అడ్లూర్–ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటం గమనించారు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ అజర్ అక్కడికి చేరుకుని పరిశీలించగా, పందిరి నాగరాజు అడ్లూర్ ఎల్లారెడ్డి అని తెలిసింది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించాడు.

అజర్ వెంటనే ధైర్యం చెప్పి, సమయస్ఫూర్తితో స్పందించి అతడిని సురక్షితంగా కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్ది, సంబంధిత వ్యక్తిని సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సదాశివనగర్ పోలీసులు, కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలతో ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ విజ్ఞప్తి చేశారు.

Next Story