- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘లవ్ ఓలవ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం, విడుదలైన కేవలం మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

దిశ, సినిమా: తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ నాగదుర్గ, ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘కలివనం’ చిత్రంతో మెప్పించిన ఆమె, ఇటీవల కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ సరసన ‘లవ్ ఓ లవ్’ అనే చిత్రంలో ఆమె నటించారు. జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం, విడుదలైన కేవలం మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
జూలై 31 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. తమిళంలో ఆశించిన విజయం సాధించలేకపోయినా, నాగదుర్గ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె ‘ఇడుపు కాయితం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యంగ్ హీరో ప్రియదర్శి సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొంత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వివాదంపై మూవీ టీమ్ తక్షణమే స్పందించి సరైన క్లారిటీ ఇవ్వడంతో ఆ కాంట్రవర్సీకి ముగింపు పడింది. ప్రస్తుతం నాగదుర్గ తెలుగులో పెద్ద ప్రాజెక్ట్ చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






