వ్యవసాయ బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

by Kodari Anjali |

ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

వ్యవసాయ బావిలో దూకి యువకుడి ఆత్మహత్య
X

దిశ, చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తొర్లికొండ కోటేశ్వరావు చిన్న కుమారుడు ఉపేందర్ (22) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై, గ్రామ శివారులోని నల్లచెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉపేందర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Next Story