కోర్టు విచారణల వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు నిషేధం

by Malleboina Mahesh |   (  Updated:2026-07-24 09:22:32  IST  )

అనుమతి లేకుండా కోర్టు లైవ్-స్ట్రీమింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, మానిటైజ్ చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం; కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు.

కోర్టు విచారణల వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్: కోర్టు విచారణల వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల ప్రత్యక్ష ప్రసారాల (Live-streamed proceedings) వీడియోలను అనధికారికంగా సోషల్ మీడియా, డిజిటల్ వేదికలలో రీ-పోస్ట్ చేయడం, సవరించడం (మోడిఫికేషన్), వాటి ద్వారా ఆదాయం పొందే (మానిటైజేషన్) చర్యలపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన ఆడియో/వీడియోలను తీసుకోవడం, మార్చేయడం, సామాజిక మాధ్యమాలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం, రీ-పోస్ట్ చేయడం వంటివి చేయరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వుల్లో ప్రధానాంశాలు:

వెబ్‌సైట్లలో ప్రదర్శన: ఈ ఆదేశాలను వెంటనే సుప్రీంకోర్టుతో పాటు అన్ని రాష్ట్రాల హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని సెక్రటరీ జనరల్, రిజిస్ట్రార్ జనరల్స్‌ను ఆదేశించింది.

వార్తా సేకరణకు మినహాయింపు: మాధ్యమాల ద్వారా జరిగే సాధారణ వార్తా ప్రసారాలకు (News Reporting) ఈ ఉత్తర్వులు వర్తించవు అని కోర్టు స్పష్టత ఇచ్చింది.

కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు: కోర్టుల ప్రత్యక్ష ప్రసారాల అనధికారిక వినియోగం, మార్ఫింగ్, మానిటైజేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

పేపర్ లీక్‌లపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

Next Story