- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు.. విపక్షాల ఆందోళన
పార్లమెంట్ వేదికగా మరో కీలక బిల్లుపై రగడ మొదలైంది. దేశభక్తి గేయమైన వందేమాతరం గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన వందేమాతరం బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వేదికగా మరో కీలక బిల్లుపై రగడ మొదలైంది. దేశభక్తి గేయమైన వందేమాతరం గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన వందేమాతరం బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం వందేమాతరాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపకల్పన చేశారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే జైలుశిక్ష విధించడంతో పాటు, ఇకపై ఈ గేయాన్ని ఎక్కడ ఆలపించినా పూర్తిగా మాత్రమే పాడాలనే కఠిన నిబంధనను కూడా బిల్లులో పొందుపరిచారు.
విపక్షాల నిరసన - సభ తీవ్ర వాయిదా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లులోని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు సభలో నిరసనకు దిగారు. దీంతో విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో, చైర్మన్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వందేమాతరం బిల్లుపై సోమవారం సభలో పూర్తిస్థాయి చర్చ జరగనుంది. ప్రభుత్వం దీనిని చట్టంగా మార్చాలని పట్టుదలతో ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం తమ నిరసనను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.






