- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలాగూడలో వరుస చోరీలకు పాల్పడిన బాల నేరస్థుడికి రెండేళ్ల ప్రత్యేక గృహ శిక్ష
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడిన 16 ఏళ్ల బాల నేరస్థుడికి నాంపల్లి ఐదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్లపాటు ప్రభుత్వ ప్రత్యేక బాలుర గృహంలో ఉంచాలని తీర్పు వెలువరించింది.

దిశ, సికింద్రాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడిన 16 ఏళ్ల బాల నేరస్థుడికి నాంపల్లి ఐదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్లపాటు ప్రభుత్వ ప్రత్యేక బాలుర గృహంలో ఉంచాలని తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు అలవాటైన ఆస్తి నేరస్థుడు కాగా, గతంలో అతనిపై మొత్తం ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ లాలాగూడలోని రైల్వే అధికారుల బంగ్లాల్లో చొరబడి నగదు, విలువైన వస్తువులను చోరీ చేసిన ఘటనలపై లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్లు 52/2026, 67/2026 కింద కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి బాల నేరస్థుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలుర గృహంలో రెండేళ్లపాటు ఉంచాలని ఆదేశించారు. ఈ వివరాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి. రవికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.






