స్వచ్ఛ రామగుండం.. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన

by Jakkula.Mamatha |

తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని, స్వచ్ఛ రామగుండం వార్డ్‌గా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు ఆర్ఎఫ్‌సీఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము అన్నారు.

స్వచ్ఛ రామగుండం.. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన
X

దిశ,గోదావరిఖని: తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని, స్వచ్ఛ రామగుండం వార్డ్‌గా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు ఆర్ఎఫ్‌సీఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము అన్నారు. శుక్రవారం వార్డులో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్త పై డివిజన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వర్షాకాలంలో వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని, పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లేనియెడల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.

ముఖ్యంగా దోమల వల్ల డెంగ్యూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాకాలంలో మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకొని ప్రజలందరూ అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలన్నారు. శానిటేషన్, దోమల ఫాగింగ్ ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ మమేకమైతే స్వచ్ఛ రామగుండం డివిజన్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ యూసఫ్, వర్డ్ ఆఫీసర్ సాయి కృష్ణ, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story