తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. జులై 26 నుంచి భారీ వర్షాలు మళ్ళీ మొదలు

by Malleboina Mahesh |

తెలంగాణలో జులై 26 నుంచి పెరగనున్న వర్ష తీవ్రత; ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం.

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. జులై 26 నుంచి భారీ వర్షాలు మళ్ళీ మొదలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నీనో ప్రభావంతో గత కొన్ని రోజులుగా ‘బ్రేక్ మాన్సూన్’ పరిస్థితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వాతావరణ నిపుణుడు తెలంగాణ వెదర్‌మ్యాన్ ప్రకారం ఈ పరిస్థితి ముగియనుంది. తాజా అంచనా ప్రకారం రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. శనివారంతో ఈ పొడి వాతావరణం ముగిసి, జులై 26 (ఆదివారం) నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ తాజా అలర్ట్ ప్రకారం.. ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్‌తో సహా మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం, అక్కడక్కడా స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

Next Story