- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. ఇందిరా పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం
కేటీఆర్ బీఆర్‌ఎస్ ధర్నాను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్‌తో కలిసి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘నీట్’ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ (BRS) ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ నాయకులతో కలసి ధర్నా చేపట్టడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ ఆందోళనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగడంతో ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ ఆందోళన – పోలీస్ బందోబస్తు
కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ నిరసనను అడ్డుకునేందుకు సమాయత్తమయ్యారు. ఆదర్శ్ నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇందిరా పార్క్‌కు ర్యాలీగా వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే యత్నం చేస్తున్నారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే..
ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ విద్యార్థిని మరణంపై కేటీఆర్ అత్యంత అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. సమస్య తీవ్రతను పక్కనపెట్టి, సదరు అమ్మాయి లవ్ ఎఫైర్ వల్లే చనిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేయకుండా ‘ధర్నా చౌక్’ను ఎత్తివేశారని గుర్తుచేశారు. నేడు అదే ధర్నా చౌక్‌లో కేటీఆర్ రాజకీయ స్వార్థం కోసం నిరసనలు తెలపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసమే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే ధర్నా చౌక్‌లో అడుగుపెట్టాలని అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.






