- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణ స్కూల్‌లో ఘనంగా స్టూడెంట్ కేబినెట్ ఇన్‌వెస్టిచర్ కార్యక్రమం
నిజామాబాద్‌లోని నారాయణ స్కూల్, సుభాష్ నగర్ బ్రాంచ్ లలో స్టూడెంట్ కేబినెట్ ఇన్‌వెస్టిచర్ అండ్ కేబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్‌లోని నారాయణ స్కూల్, సుభాష్ నగర్ బ్రాంచ్ లలో స్టూడెంట్ కేబినెట్ ఇన్‌వెస్టిచర్ అండ్ కేబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం సూర్యవంశి శివాజీ నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకత్వం అనేది ఒక హోదా మాత్రమే కాదని, అది గొప్ప బాధ్యత అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వహిస్తూ ఆదర్శ నాయకులుగా ఎదిగి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నూతన కేబినెట్ సభ్యులు బాధ్యతలు స్వీకరించి, పాఠశాల అభివృద్ధి, క్రమశిక్షణ పరిరక్షణ విషయంలో తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ జెడ్సీఓ రాకేష్, ఈ - చాంప్స్ జెడ్సీఓ అజీమా, ఈ - కిడ్జ్ జెడ్సీఓ కల్పన, బ్రాంచ్ ప్రిన్సిపాల్ గడిచర్ల చందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నూతన విద్యార్థి నాయకులను అభినందించారు.






