ఆగని విపక్షాల ఆందోళనలు.. 10 నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-24 06:33:35  IST  )

లోక్‌సభలో ఇవాళ మళ్లీ అదే గందరగోళం మొదలైంది.

ఆగని విపక్షాల ఆందోళనలు.. 10 నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కార్గిల్‌ అమరవీరులకు సంతాప తీర్మానాన్ని పెట్టారు. ఈ సందర్భంగా సభ్యులంతా అమరవీరులకు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. అనంతర స్పీకర్ క్వశ్చన్‌ అవర్‌ను ప్రారంభిస్తుంగా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ‘నీట్’ అక్రమాలపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా కలుగుజేసుకుని ‘నీట్’ చర్చకు సిద్ధమని.. సభ నడిచేందుకు సహకరించాలని విపక్ష సభ్యలను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. అయినా.. వారి ఆందోళనలు ఆపకపోవడం సభను నిర్వహించడం సాధ్యపడకపోవడంతో, లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

కీలక పరిణామం.. నిరసనల వేళ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ

ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ ఫిక్స్.. తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ!

Next Story