కీలక పరిణామం.. నిరసనల వేళ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ

by Malleboina Mahesh |   (  Updated:2026-07-24 04:35:34  IST  )

పేపర్ లీక్‌ల అడ్డుకట్ట, సోనమ్ వాంగ్‌చుక్ హామీల అమలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ల నడుమ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర కేబినెట్ భేటీ.

కీలక పరిణామం.. నిరసనల వేళ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet meets) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలు ఖరారు చేసే కొత్త బిల్లు ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 26 రోజుల ఆమరణ దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్‌కు ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేత, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, సభలో సమగ్ర చర్చపై కేబినెట్ స్పష్టతనివ్వనుంది. అటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే విపక్షాలు, విద్యార్థి సంఘాల డిమాండ్ నడుమ ఈ కేబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story