- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో యువకుడి స్టంట్లు.. భయం గుప్పిట్లో స్థానికులు
మఠంపల్లి మండల కేంద్రంలోని జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అత్యంత ప్రమాదకరంగా వీలింగ్‌లు చేస్తూ, ఒంటి చక్రం పై బైక్ నడుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు

దిశ, మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే ప్రధాన చౌరస్తాలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అత్యంత ప్రమాదకరంగా వీలింగ్‌లు చేస్తూ, ఒంటి చక్రం పై బైక్ నడుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. నల్లటి టీ షర్ట్, తెల్లటి ప్యాంటు ధరించిన యువకుడు మెయిన్ సెంటర్‌లోనే అధిక వేగంతో బైక్ పై విన్యాసాలు చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు చేయడం తీవ్ర ఆందోళన కలిగించిందని స్థానికులు తెలిపారు.ఒక్క క్షణం అదుపు తప్పినా అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, రోడ్డుపై నడిచే పాదచారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలకు ఇలాంటి చర్యలు ముప్పుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం సరదా కోసం చేస్తున్న ఈ విన్యాసాలు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే యువకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు వాహనాలను ఎలా నడుపుతున్నారో పర్యవేక్షించి బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మఠంపల్లి వంటి రద్దీ ప్రాంతాల్లో వీలింగ్‌లు, రేసింగ్‌లు, ప్రమాదకర బైక్ విన్యాసాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక్క నిమిషం సరదా కోసం చేసే స్టంట్.. జీవితాంతం విషాదంగా మారకముందే అధికారులు అప్రమత్తం కావాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.






