'ఆర్ఎక్స్ 100'ను విజయ్ దేవరకొండ అందుకే వదులుకున్నాడు? అసలు విషయం రివీల్ చేసిన అజయ్ భూపతి

by Pulgam srinivas |

గ్రామీణ నేపథ్యం కారణంగా 'ఆర్ఎక్స్ 100' చిత్రాన్ని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసినట్లు అజయ్ భూపతి చెప్పారు.

ఆర్ఎక్స్ 100ను విజయ్ దేవరకొండ అందుకే వదులుకున్నాడు? అసలు విషయం రివీల్ చేసిన అజయ్ భూపతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా జయకృష్ణ ఘట్టమనేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ... 'ఆర్ఎక్స్ 100' సినిమా కథను మొదట విజయ్ దేవరకొండకు వినిపించానని తెలిపారు.

అప్పటికి విజయ్ నటించిన 'పెళ్లిచూపులు' సినిమా విడుదల కాలేదు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయ్యి ఈ కథను చెప్పాను. కథ మొత్తం విన్న తర్వాత విజయ్‌కు నచ్చింది. అయితే సినిమాలో హీరో పాత్ర పూర్తిగా గ్రామీణ నేపథ్యానికి చెందినది. విజయ్ మాత్రం అర్బన్ లుక్‌లో ఉండటంతో ఆ పాత్ర తనకు సెట్ కాదేమోనని భావించి సినిమా చేయడానికి నిరాకరించాడని అజయ్ భూపతి వెల్లడించారు. ఆ తర్వాత 'ఆర్ఎక్స్ 100' చిత్రంలో కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా ఈ ఇద్దరికీ నటులుగా మంచి గుర్తింపు, ప్రశంసలు తీసుకొచ్చింది.j

Next Story