కోనేరులో ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు!

by Jakkula.Mamatha |

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయ కోనేరులో ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు.

కోనేరులో ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు!
X

దిశ,గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయ కోనేరులో ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన ఎండి నజీర్(47) శుక్రవారం ఉదయం సుమారు 9:16 గంటలకు కోనేరులో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గోపాల్‌పేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కోనేరులో పాతాళగడియ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కోనేరులో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story