సీఎం చంద్రబాబుకు రంపచోడవరంలో ఘన స్వాగతం

by Malleboina Mahesh |

రంపచోడవరంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం; విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో కలిసి అల్లూరి, సరస్వతీ దేవి విగ్రహాలకు నివాళులు.

సీఎం చంద్రబాబుకు రంపచోడవరంలో ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా ఈ రోజు పోలవరం జిల్లాకు వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రంపచోడవరం స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణానికి చేరుకోగా.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, కూటమి నాయకులు, ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులు, విద్యార్థులు కలిసి ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి విద్యాదేవత సరస్వతీ దేవి చిత్రపటానికి, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించి, వారి విద్యావసరాలు తెలుసుకోవడంతో పాటు ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

Next Story