‘మన్ కీ బాత్’ ప్రసంగాలొద్దు: ప్రధాని మోదీపై AICC చీఫ్ ఖర్గే తీవ్ర ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-24 06:05:30  IST  )

రాజ్యసభాపక్ష నేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు.

‘మన్ కీ బాత్’ ప్రసంగాలొద్దు: ప్రధాని మోదీపై AICC చీఫ్ ఖర్గే తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నీట్’ విద్యార్థుల ఆందోళన వేళ అర్థరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సెల్ఫీ వీడియో విడుదల చేయడంపై రాజ్యసభాపక్ష నేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏకపక్షంగా రేడియోలో ప్రధాని ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమాలు నిర్వహించడం మాని, దేశంలో ఉత్పన్నమవుతున్న కీలక సమస్యలు, నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై పార్లమెంట్ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని తన ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలకు కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప, దేశ ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET), యుజీసీ-నెట్ (UGC-NET) పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై పార్లమెంట్ వేదికగా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ ఖర్గే చేశారు. దేశంలోని ఈ పరిస్థితులతో యువత తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే మోదీ ‘మన్ కీ బాత్’ లాంటి కార్యక్రమాలు వాడుకుంటున్నారని ఆరోపించారు. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పకుండా పారిపోతోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రధాని ఏమాత్రం గౌరవించడం లేదని ఖర్గే నిప్పులు చెరిగారు.

"మిస్టర్ మోడీ.. అతి తెలివి ప్రదర్శించకండి".. ప్రధాని ప్రకటనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Next Story